సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (16:27 IST)

ఐసీసీ ప్రపంచ కప్ : ప్రారంభ మ్యాచ్‌కు ప్రేక్షకులు ఎక్కడ?

namo stadirum
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన ఈ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. ఈ స్టేడియంలో మొత్తం ప్రేక్షకుల కెపాసిటీ 1.32 లక్షలు కాగా, కనీసం రెండు వేల మంది లేక వెలవెలబోయింది. స్టేడియం మొత్తం దాదాపుగా ఖాళీగానే కనిపించింది. 
 
భారత్‌లో వరల్డ్ కప్ టోర్నీ సన్నాహాలు ఆలస్యంగా మొదలుకావడం, టిక్కెట్ల బుకింగ్‌లో సమస్యలు ప్రేక్షకుల లేమికి కారణాలుగా తెలుస్తున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే కొన్ని నెలల ముందుగానే టిక్కెట్లు మొత్తం ఖాళీ అయిపోయి వుంటాయి. కానీ, ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు. 
 
అయితే, గుజరాత్ అధికారపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ మ్యాచ్ కోసం 40 వేల టిక్కెట్లను రిజర్వు చేసుకున్నట్టు నిర్ధారించింది. ఇటీవల కేంద్ర మహిళా బిల్లు ఆమోదింపజేసుకున్న నేపథ్యంలో ఆ 40వ టిక్కెట్లన మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తామని, వారికి ఉచితంగా భోజనం, టీ కూపన్లు కూడా అందజేస్తామని చెప్పింది. కానీ ఆ  40 వేల టిక్కెట్ల సంగతి ఏమైందో తెలియదు.