మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (11:07 IST)

ఆసియా క్రీడల్లో విజయవాడ అమ్మాయికి 'బంగారు'

jyothi surekha gold
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు సంఖ్యల్లో బంగారు పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 71కు చేరింది. గత 2018లో జరిగిన క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలు సాధించగా, ఇపుడు ఆ సంఖ్యను అధికమించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ బంగారు బతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ మిశ్రమ ఈవెంట్‌లో ఓజాస్ దియోతలేతో కలిసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ జంట... దక్షిణా కొరియా ఆటగాళ్లను చిత్తు చేసి విజేతగా నిలించారు. ఫైనల్ పోటీలో సురేఖ - ఓజాస్ 159 -158 స్కోరుతో సో చయివాన్ - జూ
జహివూన్‌పై ఉత్కంఠ  విజయం సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 71కు చేరింది.