సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:14 IST)

జనవరిలో 5జీ స్మార్ట్ ఫోన్... 10 జీబీ ర్యామ్.. వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్

ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. ప్రతి ఒక్కరి చేతుల్లో 4జీ స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే, వచ్చే యేడాది నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమీ ఈ 5జీ టెక్నాలజీ స్మార్ట్ ఫోనును మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
 
ఎంఐ మిక్స్ 3 పేరుతో తయారు చేసిన ఈ ఫోన్‌ను ఆ కంపెనీ ఇప్పటికే చైనాలో ప్రదర్శించింది. 5జీ నెట్‌వర్క్ ద్వారా ఫోన్ పనితీరు, సామర్థ్యం, వెబ్ సర్ఫింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్ వంటివి ఎంత వేగంగా ఉంటాయో షావోమి సంస్థ డెమో ద్వారా తెలిపింది. 5జీ స్పీడ్ కోసం దీనిలో ఎక్స్‌50 మోడెమ్‌ను అమర్చారు. శక్తివంతమైన క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో అమర్చారు. 
 
ఈ ఫోన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, 
* 12+12 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
* 256జీబీ అంతర్గత మెమరీ
* 6.39 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
* 1080×2340 పిక్సెల్‌ రిజెల్యూషన్‌
* క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855
* 10 జీబీ ర్యామ్‌
* 24+2 ఎంపీ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా
* 3200 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం