బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (16:34 IST)

శామ్‌సంగ్ ''సారీ'' చెప్పింది.. ఎవరికో తెలుసా?

అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ, చిప్ మేకర్ అయిన శామ్‌సంగ్ సారీ చెప్పింది. ఎందుకు.. ఎవరికి అని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు క్షమాపణలు చెప్పింది.


క్యాన్సర్ బాధితులు కూడా సెమీకండెక్టర్ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారని తెలిసి సంస్థ యాజమాన్యం క్షమాపణలు వేడుకుంది. తమ సంస్థల్లో అనారోగ్యాలతో పనిచేసే కార్మికులకు వారి కుటుంబాలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నామని సంస్థ ఉపాధ్యక్షుడు కిమ్ కి-నామ్ అన్నారు. 
 
సెమీకండెక్టర్, ఎల్సీడీ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్య బీమా కల్పించడంలో విఫలమైనట్లు కిమ్ ఒప్పుకున్నాడు. సంస్థ మాజీ అధ్యక్షుడు పార్క్- గెన్ అవినీతి కారణంగా ఈ తప్పు జరిగిపోయిందన్నారు. కానీ 240 మంది కార్మికులు తమ ఫ్యాక్టరీలలో పనిచేయడం ద్వారా పని ఆధారిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. ఇంకా 80 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 
 
ఫలితంగా శామ్‌సంగ్ గ్రూపు నష్టపరిహారంగా 150 మిలియన్లు చెల్లించనుందని కిమ్ వెల్లడించారు. ఇందులో ఆరోగ్య బీమా కింద 16 రకాల వ్యాధులను నయం చేసుకునేందుకు నగదును పొందవచ్చు. సెమీకండెక్టర్‌లో పనిచేసే కార్మికులు క్యాన్సర్ వ్యాధితో అత్యధికంగా మరణిస్తున్నారని తెలిసిందని.. ఇకపై శామ్‌సంగ్ కార్మికుల ఆరోగ్యంపై సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించదని ఆయన చెప్పుకొచ్చారు.