శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (12:28 IST)

చిన్నారులకు పాలతో కమలాపండు కలిపి తినిపిస్తున్నారా?

చిన్నారులకు పాలతో పాటు కమలాపండును తినిపిస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. చాలామంది చిన్నారులకు పాలతో పండ్లు కూడా తినిపిస్తారు. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటారు. అయితే పాలతో పాటు కమలా ప

చిన్నారులకు పాలతో పాటు కమలాపండును తినిపిస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. చాలామంది చిన్నారులకు పాలతో పండ్లు కూడా తినిపిస్తారు. దానివల్ల  వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటారు. అయితే పాలతో పాటు కమలా పండును చిన్నారులకు ఒకేసారి ఆహారంగా ఇస్తే వారిలో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కమలాఫలమే కాదు, దాన్నుంచి తీసిన రసం కూడా పాలు తాగిన వెంటనే ఇవ్వకూడదు. అలాగే రెండు రకాల పండ్లను ఒకేసారి ఇవ్వకూడదు. పూటకో పండు ఇస్తే సరిపోతుంది. 
 
ఇదేవిధంగా పైనాపిల్‌లో ఉండే బ్రోమిలెన్‌ పదార్థం పాలల్లో కలిపినప్పుడు విషపూరితంగా మారుతుంది. దీనికారణంగా తలనొప్పి, కడుపునొప్పి వస్తాయి. అలాగే జీర్ణకోశ సంబంధిత సమస్య ఉత్పన్నమవుతుంది. వాంతులు అవుతాయి. కొన్ని సందర్బాల్లో ఇన్ఫెక్షన్లకు లేదా డయేరియాకు దారితీస్తుంది.
 
బొప్పాయిని నిమ్మపండు కలిపి తినిపించకూడదు. ఇలా చేస్తే హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమయ్యే ఛాన్సుంది. ఫలితంగా చిన్నారుల్లో ఎనీమియాకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెంటినీ కలిపి చిన్నారులకు పెట్టకపోవడం ఉత్తమం అని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.