శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (18:35 IST)

కిడ్ట్జోపియా: ఇనార్బిట్‌ మాల్‌లో వేసవి వినోదం

Baby
హైదరాబాద్‌: వేసవి సెలవులంటేనే వినోదం, ఉత్సాహానికి చిరునామాలు. ఇనార్బిట్‌ మాల్‌లో కిడ్ట్జోపియా అందుకు మినహాయింపేమీ కాదు. చిన్నారుల కోసం వేసవి అద్భుతం కిడ్ట్జోపియా. సృజనాత్మక కార్యక్రమాలు, ఆహ్లాదకరమైన వర్క్‌షాప్‌లు, వినోదాత్మక ప్రదర్శనలు వారాంతంలో కనువిందు చేయనున్నాయి.

 
ఈ కార్యక్రమం జూన్‌ 05,2022 వ తేదీ వరకూ జరుగనున్నాయి. హామ్లే యొక్క గెట్‌ క్రియేటివ్‌ లేబరేటరీ ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ వద్ద ఏర్పాటు చేయనున్నారు. మీ చిన్నారులు సైన్స్‌ ల్యాబ్‌లో వినోదాత్మక ప్రయోగాలు చేయడం లేదంటే మా వలెంటీర్ల మార్గనిర్దేశకత్వంలో చెఫ్‌గా మారి ఆసక్తికరమైన వంటకాలను చేయడం చేయవచ్చు. వీటితో పాటుగా లెగో సిటీతో మీరు సంపూర్ణ వినోదమూ పొందవచ్చు.

 
ప్రస్తుతం జరుగుతున్న కిడ్జ్టోపియా నగరవాసులను అమితంగా ఆకట్టుకోనుంది. దీనిని మీరు అస్సలు మిస్‌ చేసుకోలేరు. మీతో పాటుగా మీ కుటుంబసభ్యులందరికీ ఇది వినోదాత్మక వారాంతంగా నిలువనుంది. జగ్లర్‌, ఎంటర్‌టైనర్‌ శాండీ ప్రదర్శనలు ఈ వారాంతంలో మీకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ నెల 28,29 తేదీలలో అతని ప్రదర్శనలు ఉంటే, జూన్‌ 4-5 తేదీలలో మెజీషియన్‌ యోగేష్‌ తన అత్యద్భుతమైన మ్యాజిక్‌ ట్రిక్స్‌తో అలరించనున్నారు.

 
హైదరాబాద్‌లో ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా సందర్శించాల్సిన మాల్‌గా ఇనార్బిట్‌ మాల్‌ నిలుస్తుంటుంది. వినూత్న అనుభవాలను అందించే ఈ మాల్‌ షాపింగ్‌ కోసం  అత్యుత్తమ కేంద్రంగా నిలువడమే కాదు డైనింగ్‌, వినోదం కోసమూ అత్యంత అనుకూలంగా ఉంటుంది.