గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 మార్చి 2022 (23:19 IST)

సీతాకోక చిలుకల నేపథ్యంతో వేసవి ఆహ్లాదాన్ని తీసుకువచ్చిన ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌

ఈ వారాంతం, హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ నగరవాసులను మాల్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తూనే అత్యంత విలాసవంతమైన, సీతాకోక చిలుకలు, పూల నేపథ్యంతో అలంకరించిన డెకార్‌ను ఆస్వాదించాల్సిందిగా కోరుతుంది. ‘ బ్లూమ్‌ ఇన్‌ టు స్ర్పింగ్‌ ’(వేసవి లో వికాసం ) నేపథ్యంతో తీర్చిదిద్దిన ఈ అలంకరణతో పాటుగా నూతన బ్రాండ్లు అయిన ఫిజ్జీ గోబ్లెట్‌, మ్యాక్స్‌ మరియు బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌లు తమ తలుపులను మొట్టమొదటి సారిగా మాల్‌లో తెరిచాయి.

 
ఇటీవలనే ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ ఫిజ్జీ గోబ్లెట్‌ తమ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ప్రారంభించింది. పలువురు సెలబ్రిటీలకు అభిమాన బ్రాండ్‌ అయిన ఫిజ్జీ గోబ్లెట్‌ బ్రాండ్‌ కలెక్షన్స్‌ శ్రేణి క్లాసిక్‌ మరియు సమకాలీన జుట్టీస్‌, ఫిజ్జీ హీల్స్‌, ఫిజ్జీ కొల్హాస్‌ నుంచి ఫన్‌ స్లైడర్స్‌ వరకూ ఉంటాయి.

 
ప్రారంభోత్సవ సందర్భంగా ఫిజ్జీ గోబ్లెట్‌  తమ స్టోర్‌కు మార్చి 25 నుంచి మార్చి 27 వరకూ సందర్శించిన వారికి 3000 రూపాయల విలువైన స్లైడర్స్‌ను స్టోర్‌లో ఏదైనా ఫుట్‌వేర్‌ కొన్న ఎడల అందిస్తుంది. అదే రీతిలో మ్యాక్స్‌, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ సైతం తమ నూతన స్టోర్లను తెరవడంతో పాటుగా అపరిమిత షాపింగ్‌కు మహోన్నత కారణాలను అందిస్తున్నాయి.

 
ఈ ఉత్సాహపూరిత అనుభవాలకు మరింత సున్నితత్త్వం జోడిస్తూ వేసవి సీజన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ‘బ్లూమ్‌ ఇన్‌ టు స్ర్పింగ్‌’ నేపథ్యంతో తీర్చిదిద్దిన డెకార్‌, పూలు, సీతాకోక చిలుకలను జోడించుకుంది. వినియోగదారులు తమ ప్రియమైన వారితో మధురక్షణాలను బంధించుకునే అవకాశమూ ఇక్కడ కలుగుతుంది. అంతేనా, ఆఫీస్‌లకు వెళ్లేవారు మారుతున్న సీజన్‌కు అనుగుణంగా తమ వార్డ్‌రోబ్‌ను తీర్చిదిద్దుకునేందుకు పలు బ్రాండ్లు నూతన స్ర్పింగ్‌ మరియు బ్యాక్‌ టు ఆఫీస్‌ కలెక్షన్స్‌ను షాపర్లకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.

తన బ్రాండ్స్‌ అందుబాటులోకి రావడం, ఆహ్లాదకరమైన స్ర్పింగ్‌ డెకార్‌, ఉద్వేగభరితమైన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం- ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ మీరు కోరుకున్నవి మాత్రమే కాదు అంతకు మించి ఎన్నో అందిస్తుంది.