#ChocolateDay గిఫ్ట్ ఇస్తే.. డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోండి..

ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (11:24 IST)
ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లే. ఏ గిఫ్ట్ ఇవ్వాలో తోచనప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఈ చాక్లెట్ మాత్రమే. అలాంటి చాక్లెట్స్‌కు ఒక డే వుంది అదే చాక్లెట్ డే. అదీ ఫిబ్రవరి 9 చాక్లెట్ డే. చాక్లెట్‌డేని పురస్కరించుకుని, అనేక రకాల డిజైన్ బాక్సులు, హాంపర్లు, బొకేలు చాక్లెట్లతో కూడుకుని మార్కెట్లో కొలువుతీరివున్నాయి. 
 
అంతేకాకుండా, కొన్ని సంస్థలు, మీరు ఇష్టపడే వ్యక్తి పేర్లను ప్రత్యేకంగా చాక్లెట్ల మీద ముద్రించేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇక ప్రేమికులు వాలైంటెైన్ వీక్ కావడంతో చాక్లెట్ డేన తమ ప్రేమ భాగస్వాములకు చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇస్తున్నారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాక్లెట్లను గిఫ్టుగా ఇస్తున్నప్పుడు ఎదుటివారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాక్లెట్ రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. 
 
ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా నెలసరి సమయాలలో నొప్పిని తగ్గిస్తుంది. మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా, ఇందులో ఉండే కోకో ఆధారంగా డార్క్ చాక్లెట్ రుచి మారుతుంది. అందుకే ఈ చాక్లెట్‌ను గిఫ్టుగా ఇవ్వొచ్చు. వీటితో పాటు మిల్క్ చాక్లెట్లు కూడా ఆరోగ్యానికి మంచివని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments