బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2019 (22:27 IST)

ప్రేమ విఫలమయితే ఎక్కువ బాధపడేది ఎవరు?

అమ్మాయిలు-అబ్బాయిల మధ్య ప్రేమ. ఈ ప్రేమ విఫలమైతే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ బాధపడతారని భారత్ సహా 96 దేశాల్లో చేసిన అధ్యయనంలో తేలింది. లవ్ ఫెయిల్ అయితే అమ్మాయిలే ఎక్కువ మానసికంగా, శారీరకంగా బాధలు అనుభవిస్తారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌, అమెరికా, భారత్‌ కెనడా, బ్రిటన్‌, జర్మనీ దేశాల్లో అధ్యయనం చేశారు. 
 
లవ్‌లో నిమగ్నమై అమ్మాయిలు ఒక్కడుగు ముందుకేసినా గర్భం.. శారీరక బాధను అనుభవించాల్సిందేనని.. దీనినే జీవ సంబంధమైన అంశంగా పరిశోధకులు తెలిపారు. ప్రేమ విషయంలో సున్నితంగా ఉండే అమ్మాయిలు విఫలమైతే మాత్రం చాలా ఎక్కువగా బాధపడుతారని పరిశోధకులు అన్నారు. ప్రేమ విఫలమైతే ఆ ప్రేమను జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా అంత సులభంగా మరిచిపోరని పరిశోధకులు చెప్పారు.