ప్రేమికుడి కోసం సమయం కేటాయించలేదు.. చనువుగా వుండలేదు అందుకే?

Last Updated: బుధవారం, 12 జూన్ 2019 (11:46 IST)
ప్రేమికుడితో చనువుగా వుండలేదని.. తన విఫలమైందని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వెల్లడించింది. దక్షిణాది హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్.. ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్... తన  లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చింది. 
 
సినిమాల్లోకి రాకముందే కాజల్ అగర్వాల్ ప్రేమ విఫలమైందట. ఆ ప్రేమ విఫలమయ్యాక సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. సినిమాల్లో దూసుకుపోతున్న సమయంలో కాజల్ అగర్వాల్‌ను ఓ వ్యక్తి ప్రేమించాడట. కానీ అతడికి సినిమా రంగం నచ్చలేదు. సినిమాల్లో నటించడం, సినిమా షూటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రేమికుడి కోసం సమయం కేటాయించలేకపోవడం ద్వారా ఆ ప్రేమ కొనసాగలేదు. 
 
ప్రేమకు ముఖ్యం ప్రేమికులు ఒకరినొకరు చూస్తూ.. అప్పుడప్పుడు కలవడం వంటివే. కానీ అలాంటి అవకాశాలు లేకపోవడం వల్లే ప్రేమికుడు తనకు దూరమయ్యాడని కాజల్ చెప్పుకొచ్చింది. అతనితో చనువుగా వుండలేకపోవడం.. అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగకపోవడం వల్లే తన ప్రేమ మాయమైందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :