కాళ్లు విరిగిన తాప్సీ.. ట్విట్టర్‌లో పిండికట్టు ఫోటోలు
హీరోయిన్ తాప్సీకి రెండు కాళ్లు విరిగినట్టుగా ఉన్నాయి. ఎడమ చేతికి కూడా బాగా గాయాలయ్యాయి. దీంతో రెండు కాళ్లకు పిండి కట్టు కట్టిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, తాప్సీ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్టు, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయ్యంతా ఎర్రగా కందిపోయి ఉంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళనకుగురై... ఏం జరిగిందంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం తాప్సీ గేమ్ ఓవర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె బిజీగా గడుపుతోంది. అందులో భాగంగానే ఈ ఫోటోలను విడుదల చేసిందా? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా? అన్న విషయమై స్పష్టత లేదు.
ఇక ఈ ఫొటోకు క్యాప్షన్‌గా 'మంచు కొండల్లో షిఫాన్ చీరలు కట్టుకుని 25 రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను' అని తాప్సీ పేర్కొంది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అసలేం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు.