శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (15:26 IST)

తాప్సి ‘గేమ్ ఓవర్’ రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?  

ప్రముఖ కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. 
 
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14న విడుదల అవుతోందని చిత్ర నిర్మాత‌లు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. 
 
ఇప్పుడు తమ మరో ప్రయత్నంగా తాప్సి ప్రధాన పాత్రలో ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్. ఓ సరికొత్త కథ‌, కథనాలతో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
నయనతార కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం రూపొందింది.
 
 గేమ్ ఓవర్ చిత్రం కథ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. 'ఆనందో బ్రహ్మ' తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని తాప్సి అన్నారు. ఈ సినిమాపై త‌న‌కు తెలుగులో మంచి అవ‌కాశాలు అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది తాప్సి. మ‌రి...తాప్సి ఆశ‌లు నెర‌వేర‌తాయా..? లేదా..?  అనేది చూడాలి.