Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివోహం శివోహం... నిర్వాణ షట్కం... పాప్ గాయని స్మిత గానం(వీడియో)

Written By chj
Updated: శుక్రవారం, 4 మార్చి 2016 (22:18 IST)
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్వ జిహ్వే నచ ఘ్రాణ నేత్రే,
నచ వ్యోమ భూమిర్నతేజో న వాయు, చిదానంద రూపం శివోహం, శివోహం.
 
ఇది శంకర భగవాత్పాదుల వారు నిర్వాణ షట్కంలో చెప్పిన మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో 'నేను' అంటే ఏమి కాదో విశదీకరించారు శంకరులవారు. మిగిలిన ఐదింటిలోనూ ఇదే కనబడుతుంది.
 
సామాన్య మానవుడు తన శరీరమే తాను అని అనుకుంటే మరింత లోతుగా యోచన చేసుకునేవారు పంచజ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, అంతఃకరణాల గురించి అనుకుంటారు. ఐతే సామాన్య ప్రజలు, మేధావులు కూడా చెప్పేవేమీ కాదని శంకరాచార్యులవారు చెపుతూ వాటి గురించి తను తెలుసుకున్నట్లు ఈ శ్లోకంలో చెప్తారు. అన్ని శ్లోకాలలోనూ చివర్లో చిదానంద రూపం శివోహం శివోహం అని ఉంటుంది. దీనర్థం నేను అనేది ఆనంద స్వరూపమైన శివం. అందుకే, నేనే ఆ శివాన్ని అని వివరిస్తున్నారు.
  
అద్వైత సిద్ధాంతంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ శ్లోకాలను నిర్వాణ షట్కం అని చెప్తారు. నిర్వాణం అంటే మహోతృష్టమైన, గొప్పదైన జ్ఞానం అని అర్థం అంటే... బ్రహ్మజ్ఞానం పొందడమన్నమాట. ఈ మొదటి శ్లోకంలో ఆదిశంకరచార్యులు శివోహం అంటూ అదే నేను అని చెప్పకనే చెప్పారు. ఈ శ్లోకాలను పాప్ గాయని స్మిత శుక్రవారం నాడు విడుదల చేశారు. వీడియో చూడండి.
 

అన్నీ చూడండి

రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య

Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్

చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్

టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావన

అన్నీ చూడండి

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

16-08-2026 ఆదివారం ఫలితాలు - చిన్న విషయానికే ఆందోళన చెందుతారు...

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments