ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 28 మే 2018 (17:36 IST)

నాలుగు రోజులు - 11 మంది మృగాళ్ళు.. ఒక బాలికను...?

అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మలనో, చాక్లెట్లనో చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఏకంగా 11మంది యువకులు ఒక చిన్నారిని నాలుగురోజుల

అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మలనో, చాక్లెట్లనో చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఏకంగా 11మంది యువకులు ఒక చిన్నారిని నాలుగురోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
కోయంబత్తూరు సమీపంలోని కోవై ఆనైకట్టి ప్రాంతానికి చెందిన 12 యేళ్ళ బాలిక తన తల్లిదండ్రులతో పాటు సోళయూర్‌లో జరుగుతున్న ఆలయ ఉత్సవాలకు వచ్చింది. సంతలో తల్లిదండ్రులతో కలిసి తిరుగుతూ కొద్దిసేపటికి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరూ కలిసి వెతికి చివరకు పోలీస్టేషనులో ఫిర్యాదు చేశారు. మూడురోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు బాలిక స్నేహితురాలు ఇందూజను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
 
ఆలయ ఉత్సవాల నుంచి ఇందూజ బాలికను బయటకు తీసుకెళ్ళి ఇద్దరు యువకులకు అప్పగించింది. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఒక గోడౌన్‌కు తీసుకెళ్ళి అక్కడ ఆమెను తాళ్ళతో కట్టి అత్యాచారం చేశారు. అలా తమ స్నేహితులు మరో 9 మందికి విషయం చెప్పి వారిని అక్కడకు రమ్మన్నారు. వారు కూడా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందూజ ఇచ్చిన సమాచారంతో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.