1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (11:35 IST)

ఉస్మానియాలో గ్యాంగ్ రేప్.. ఔట్ పోస్ట్ హోంగార్డు కూడా నిందితుడే...

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళపై వార్డుబాయితో పాటు మరికొందరు కలిసి అత్యాచారం చేశారు. ఇది దేశవ్యాప్తంగా కలకలంరేపింది. ముఖ్యంగా, ఈ గ్యాంగ్ రేప్‌లో ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న ఒక హ

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళపై వార్డుబాయితో పాటు మరికొందరు కలిసి అత్యాచారం చేశారు. ఇది దేశవ్యాప్తంగా కలకలంరేపింది. ముఖ్యంగా, ఈ గ్యాంగ్ రేప్‌లో ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న ఒక హోంగార్డు పాత్ర కూడా ఉంది. దీనిపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. అంతేనా, హైదరాబాద్ నగర పోలీసులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
 
ఈమేరకు తన వాయిస్ రికార్డింగును పోలీసు అధికారులకు, సిబ్బందికి వాట్సాప్ ద్వారా పంపారు. 'మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన దారుణాన్ని అందరూ పేపర్‌లో చూశారు కదా. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లింది. ఆమెను అర్థరాత్రి పూట వైద్యం కోసం ఉస్మానియాకు పంపారు. ఆమె వెంట సెక్యూరిటీగా వెళ్లాలనే బాధ్యతను కూడా విస్మరించారు. 
 
అక్కడ ఆమెపై రేప్ జరిగింది. ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న ఒక హోంగార్డు కూడా ఈ నేరంలో ఉన్నాడు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. ప్రతి కేసును కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి" అంటూ పోలీసు అధికారులను, సిబ్బందిని కమిషనర్ హెచ్చరించారు.