ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (11:53 IST)

యూట్యూబ్ చూసి జుట్టు స్ట్రైట్ చేసుకోబోయి కిరోసిన్ పోసి అగ్గిపుల్ల గీశాడు..

సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం యువతపై బాగానే పడింది. యూట్యూబ్ వీడియోలను అనుకరించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా యూట్యూబ్‌లో జుట్టు స్ట్రైట్ చేసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. 12 ఏళ్ల కుర్రాడు జుట్టు స్ట్రైట్ చేసుకునే పనిలో పడి మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబ్ వీడియో చూస్తూ కిరోసిన్ తో జుట్టు స్ట్రైట్ చేయాలనుకున్నాడు. అది చూస్తూనే అగ్గిపుల్లతో నిప్పంటించుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తిరువనంతపురంలో ఏడో తరగతి చదువుతున్న శివనారాయణను బాధితుడిగా గుర్తించారు.
 
తలకు కిరోసిన్ రాసుకుని జుట్టు స్ట్రైట్ చేయాలనుకుని అగ్గిపుల్లతో నిప్పంటించుకున్నాడు. కేవలం అతని నాయనమ్మ మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో బాత్రూంలో ఈ పని చేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పిరిట్ ఉపయోగించి జుట్టు స్ట్రైట్ చేసుకునే వీడియోలు వైరల్ అవుతుండటంతో వాటిని అనుకరించేందుకు ప్రయత్నించాడు.

విషయం తెలిసి హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపే అతను మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. అతను ఎప్పుడూ సోషల్ మీడియాలోనే కాలం గడుపుతుండే వాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.