బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:13 IST)

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసల

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. 
 
మరోవైపు సహాయక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఫ్లై ఓవర్ వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంతమంది మెట్ల దారిని విడిచిపెట్టి.. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతేగాకుండా ఫ్లై ఓవర్ భారీ వర్షాల కారణంగా కూలిపోనుందని టాక్. 
 
భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెనపైకి ప్రయాణీకులు పరుగులు తీయడంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు చెప్తున్నారు. అంతేగాకుండా ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.