మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (08:57 IST)

ముంబైని ముంచెత్తిన వర్షాలు.. రైళ్ల, విమాన రాకపోకలు బంద్.. (వీడియో)

దేశ వాణిజ్య రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నగరమంతా జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా బుధవార

దేశ వాణిజ్య రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నగరమంతా జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా బుధవారం 11 రైళ్లను పశ్చిమ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో రెండింటిని దారి మళ్లించింది.

అంతేకాక.. నగరంలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14,32వ నెంబరు రన్‌వేలు మాత్రమే విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో.. ముంబయికి రావాల్సిన దాదాపు 50 విమానాలు రద్దయ్యాయి. 
 
పలు విమానాలకు బెంగళూరు, గోవా, హైదరాబాద్‌, ఢిల్లీకి మళ్లించారు. మరో 72 గంటల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశమున్నదని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో బుధవారం డబ్బావాలా సేవలు నిలిచిపోయాయి.