ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (10:07 IST)

యూపీలో 16ఏళ్ల బాలికపై యువకుల అత్యాచారం.. వీడియో తీసి తండ్రికే పంపారు..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. పదహారేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులైన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. పదహారేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులైన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి దాన్నిసాక్షాత్తూ బాలిక తండ్రికే వాట్సాప్‌లో పంపిన దారుణ ఘటన యూపీలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మీరట్ నగరానికి సమీపంలోని భావన్‌పూర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక.. ఫిబ్రవరి 28వ తేదీన ఇంటి నుంచి ఏదో పని మీద బయటికి వచ్చింది. 
 
ఆ బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా తోటలోకి తీసుకెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ దురాగతాన్ని వీడియో తీసి దాన్ని సాక్షాత్తూ బాలిక తండ్రితోపాటు పలువురు గ్రామస్థులకు వాట్పాప్ ద్వారా పంపించారు. దీంతో బాలిక తండ్రి కూతురి అత్యాచార దృశ్యాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.