పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం.. చివరికి మోసం.. ఎక్కడ?
యూపీలోని బల్లియాలో 22 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ అత్యాచారానికి తర్వాత పెళ్లికి నో చెప్పడంతో అతని చేతిలో మోసపోయానని బాధితురాలు వాపోయింది. పెళ్లికి నిరాకరించడంపై ఆరా తీయడానికి బాధితురాలి తండ్రి వెళ్లగా, అతని తల్లిదండ్రులు, మరో బంధువు అతడిని దుర్భాషలాడి చంపేస్తామని బెదిరించారు.
దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం, నిందితుడు రజనీష్ యాదవ్ ఇటీవల తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని, 2021 నుండి తనపై పదేపదే అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధరమ్ వీర్ సింగ్ తెలిపారు.
రజనీష్ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 కింద రజనీష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అతని కుటుంబంలోని ముగ్గురు సభ్యులపై సెక్షన్ 504 కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.