బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:08 IST)

పిల్లల ముందే మహిళను వెంబడించి చంపేశాడు.. ఢిల్లీలో పట్టపగలు..?

murder
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. పిల్లల ముందే కత్తితో వెంటాడి మరి ఆ మహిళను పొడిచి చంపేశారు. ఆపై నిందితులు పరారైనారు.
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం సాగర్ పూర్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ కత్తిపోట్లకు గురైనట్లు ఫోన్ వచ్చింది. కానీ ఆమె ఆస్ప్రత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తన పిల్లలతో ఇంటికి వెళుతున్నప్పుడు నిందితుడు ఆమెను వెంబడిస్తున్నట్లు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ లభించిందని పోలీసులు తెలిపారు. 
 
ఆ ఫుటేజీ ప్రకారం నిందితుడిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.