శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (12:16 IST)

250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌

ఇంటికెళ్లే మార్గం లేక వలస కార్మికులు అల్లాడిపోతుంటే.. వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఉత్తుత్తి మాటలతో సరిపెడుతున్నాయని తేలిపోయింది. కేంద్రం కనికరించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చేతులెత్తేశాయి.

వలసకార్మికుల కోసం రైళ్లను కేటాయించాలని కోరిన రాష్ట్రాలు కార్మికులను తరలించకపోవడంతో.. 250 రైళ్లు వృథా అయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

అయితే రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అయినప్పటికీ తాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, 250 రైళ్లను కేటాయిస్తే.. మహారాష్ట్ర కేవలం వంద రైళ్లను మాత్రమే వలసకార్మికుల కోసం వినియోగించిందని అన్నారు.