శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:42 IST)

జైపూర్‌లో తొంగిచూసిన జికా వైరస్.. 29 కేసులు నమోదు..

జైపూర్‌లో జికా వైరస్ తొంగిచూసింది. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌లో 29 జికా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీటిపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.

జైపూర్‌లో జికా వైరస్ తొంగిచూసింది. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌లో 29 జికా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీటిపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న జికా బాధితుల్లో ఒకరు బీహార్‌లోని సివన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.


జైపూర్‌లో చదివే ఇతను ఆగస్టు 28న స్వగ్రామం సివన్‌కి వచ్చాడు. సెప్టెంబర్ 12వరకు అతను అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక అతనిలో జికా లక్షలు బయటపడ్డాయి. దీంతో అతని కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
 
ఇకపోతే.. బీహార్‌లోని 38 జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజస్తాన్‌లో ఇప్పటికే ఏర్పాటైన కంట్రోల్ రూమ్ ద్వారా అక్కడి పరిస్థితిని ఏడుగురు ఉన్నత స్థాయి అధికారులతో కూడిన టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 22 జికా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జికాగా అనుమానిస్తున్న కేసులను, ఆయా ప్రాంతాల్లోని దోమల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని.. ఆ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు ఈ వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు.