ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (13:03 IST)

62 యేళ్ల భామ రెండు జడలు వేసుకుని డ్యాన్స్ ఇరగదీసింది...

సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి విషయమూ ఇపుడు వైరల్ అవుతోంది. ఎంతో మంది ప్రతిభ కలిగిన వారు తమ టాలెంట్‌ను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ సోషల్ మీడియా ఎంతగానో దోహదపడుతుంది. ఈ విషయంలో చిన్నాపెద్దా అనే తేడా లేదు. ఆరేళ్ళ పాప నుంచి అరవైళ్ళ ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. 
 
తాజాగా 62 ఏళ్ల రవి బాల శ‌ర్మ‌ రెండు జడలు వేసుకుని డ్యాన్స్‌ ఇరగదీసింది. బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసిన తేజాబ్‌ సినిమాలోని "ఏక్‌ దో తీన్‌" పాటకు ఈ భామ అదిరిపోయే స్టెప్పులు వేసింది. 
 
గులాబీ రంగు కుర్తా, తెలుపు ప‌లాజో ధ‌రించి అదిరిపోయే స్టెప్పుల‌తో అచ్చం మాధురి దీక్షిత్‌ను బాలశర్మ దించేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. అయితే బామ్మ బాల శర్మ గతంలో కూడా పలు సాంగ్స్‌ చేసిన, డ్యాన్స్‌ వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి.