శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (13:49 IST)

ఆటోను ఢీకొట్టిన లారీ... ఏడుగురు మహిళల దుర్మరణం

road accident
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వస్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. 
 
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.