బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2019 (19:41 IST)

పాపం పసివాడు.. బోరు బావిలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.. కానీ?

నాలుగురోజులు.. 400మంది రెస్య్కూ సిబ్బంది. తమిళనాడు ప్రభుత్వ యంత్రాగం మొత్తం ఒకే చోట. రెండేళ్ళ చిన్నారి విల్సన్ కాపాడే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లికి సమీపంలోని నాటిమట్టిపల్లిలో రెండేళ్ళ చిన్నారిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 
 
చిన్నారిని సురక్షితంగా బయటకు తీయాలన్న ప్రయత్నం కొనసాగుతోంది. అయితే వరుణుడు మాత్రం సహకరించడం లేదు. ఎడతెరిపిలేని వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. గత శుక్రవారం చిన్నారి విల్సన్ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు.
 
శుక్రవారం రాత్రి 9గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విల్సన్ పడిపోయిన ప్రాంతం నుంచి సమాంతరంగా మరో గోతిని త్రవ్వి ఆ బాలుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అడుగడునా బండరాళ్ళు తగులుతూ ఉండడంతో సహాయక చర్యలు వేగవంతం కావడం లేదు. మరోవైపు అధునాతన రోబోటెక్ సాధనతో కూడా చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం జరిగింది. కానీ రెండుసార్లు ఫెలయ్యారు.
 
దీంతో పాత పద్థతినే ఎంచుకున్నారు. సమాంతరంగా మరో గోతిని త్రవ్వి చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే నాలుగురోజుల కావడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆక్సిజన్ ను లోపలికి పంపిస్తున్నా చిన్నారి విల్సన్ కదలడం లేదు. చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ ఆ చిన్నారి బతకాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. 
 
ఇప్పటికే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల పనులను పర్యవేక్షించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్నారి క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కమల హాసన్ లు కూడా చిన్నారి సుక్షితంగా చిన్నారి బయటపడాలని కోరుకుంటున్నారు.