మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (11:18 IST)

యూపీలో యోగి వచ్చినా తగ్గని నేరాలు.. 2 నెలల్లో 803 అత్యాచారాలు

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. గడిచిన రెండునెలల కాలంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 
 
యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు శైలేంద్ర యాదవ్ లలాయి అడిగిన ప్రశ్నకు సురేష్ కుమార్ ఖన్నా సమాధానమిస్తూ, మార్చి 15 నుంచి మే 9 వతేదీ వరకు యూపీలో 799 దొంగతనాలు, 60 దోపిడీలు, 2,682 కిడ్నాప్‌లు జరిగాయన్నారు. అత్యాచార ఘటనల్లో 50శాతం కేసులపై చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. యూపీలో యోగి పాలనలో నేరాల సంఖ్య పెరిగిందంటూ.. అందుకు నిరసనగా తామ వాకౌట్ చేస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.