శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (11:45 IST)

'జ్ఞానవాపి మసీదు కేసు' విచారణ అడ్వకేట్ గుండెపోటుతో మృతి

abhay nath yadav
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసుల్లో ముస్లింల తరపున కోర్టుల్లో వాదిస్తూ వచ్చిన సీనియర్ న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అభయ్‌నాథ్‌ను చాతిలో నొప్పి రాగానే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబులిటీ (వినడం, వినకపోవడం) అనే అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి అభయ్‌నాథ్ ముస్లిం పక్షం తరపు వాదనలను కోర్టులో వినిపించాల్సివుంది. ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. కాగా, ఈ జ్ఞానవాపి కేసులో అభయ్‌నాథ్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.