శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (10:47 IST)

రాయచూరు జిల్లాలో విషాదం-ఏసీ పేలడంతో తల్లీపిల్లలు సజీవదహనం

blast
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో తల్లి, ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు. ఈ దారుణ ఘటన రాయచూరు తాలుకాలోని శక్తి నగర్‌లో చోటుచేసుకుంది. మృతులను రంజిత (33), పిల్లలు మృదుల (13), తరుణ్య (5)గా శక్తినగర్ పోలీసులు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మాండ్య వాసి సిద్దలింగయ్య స్వామి భార్యాపిల్లలతో కలిసి కేపీసీఎల్‌ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ సమయంలో సోమవారం షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయాయని దీంతో ముగ్గురు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. 
 
అయితే, ఏసీలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలకు స్పష్టమైన కారణం తెలియరాలేదని.. దీనిపై విచారణ చేపట్టినట్లు రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు.