ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

తల్లి శవం పక్కనే రెండు రోజులు పాటు నిద్రపోయిన చిన్నారి...

deadbody
కన్నతల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని అభంశుభం తెలియని ఓ చిన్నారు.. రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నారు. తన తల్లి జీవించే ఉందన్న నమ్మకంతో ఆ బాలుడు ఆమె పక్కనే పడుకున్నాడు. పైగా, అమ్మ నిద్రపోతుందని అమ్మ వంట చేయలేదని చెప్పి, పక్కింటికి వెళ్లి ఆరగించి వచ్చాడు. చివరకు తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇఁటిలోకి వారు వెళ్ళి చూసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు సమీపంలోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళకు భర్త యేడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన 11 యేళ్ళ కుమారుడతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి చనిపోయిందన్న విషయాన్ని గ్రహించలేని ఆ బాలుడు.. తల్లిపక్కనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఆకలి వేసినపుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తల్లిమృతదేహం నుంచి దుస్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.