శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:12 IST)

ఈ ఒక్కసారి పోటీ చేయండి.. అమిత్ షా : కుదరదు.. ధన్యవాదాలు.. అద్వానీ

భారతీయ జనతా పార్టీలో భీష్మపితామహులు పేరుగడించిన రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టే. నిజానికి గత 2014 ఎన్నికల్లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బలవంతం మీద ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గాంధీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 
 
అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే స్థానం పోటీ చేయాలని అద్వానీని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. అద్వానీని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా ఒప్పించేందుకు ఆయన నివాసానికి అమిత్ షా వెళ్లారు. అపుడు గాంధీ నగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. 
 
దాంతో, కనీసం ఎల్.కె.అద్వానీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లలో ఒకరిని గాంధీనగర్‌ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా అద్వానీ నిరాకరించారు. 'కుదరదు. ధన్యవాదాలు' అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది.