ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (10:31 IST)

నేడు 'పీపుల్స్ ప్రెసిడెంట్' అబ్దుల్ కలాం ఏడో వర్థంతి వేడుకలు

abdul kalam
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏడో వర్థంతి వేడుకలు జూలై 27వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రామేశ్వరంలో 1931 అక్టోబరు 15వ తేదీన జన్మించిన ఆయన అనేక కష్టాలను ఎదుర్కొని భారత అణుశాస్త్రవేత్తగా ఎదిగారు. అక్కడ నుంచి రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశపెట్టారు. 2015 జూలై 27వ తేదీన షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో లెక్చర్ ఇస్తూ కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు. అలా తాను చనిపోయేంతవరకు తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసిన మహనీయుడు అబ్దుల్ కలాం. 
 
ఆయన వర్థంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఆయన చిత్రపటానికి రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన వర్థంతి సందర్భంగా రాష్ట్రతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వంటితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. 
 
దేవినేని ఉమ నివాళి... "క్షిపణిరంగంలో దేశఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పి మిసైల్ మ్యాన్‌గా అంతరిక్ష, అణుశాస్త్రరంగాలలో భారత్ ను బలమైనశక్తిగా నిలిపి రాష్ట్రపతిస్థాయికి ఎదిగినా నిరాడంబరంగా సాగిన ఆయనజీవితం స్ఫూర్తిదాయకం. మాజీరాష్ట్రపతి,భారతరత్న డా.ఏపీజే అబ్దుల్ కలాంగారి వర్ధంతిసందర్భంగా వారిస్మృతికినివాళులు" 
 
గల్లా జయదేవ్.. "భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశాన్ని ఎంతో ముందుకు నడిపించిన ప్రపంచ ప్రఖ్యత శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన డాక్టర్    ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను". 
 
పువ్వాడ్ అజయ్ కుమార్.. "భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం" అంటూ ట్వీట్స్ చేశారు.