ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (11:58 IST)

బాలికపై అత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

అస్సోంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు.
 
అస్సోంలో బికి అలీ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులందరూ పారిపోయారు. దీంతో ఆ బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పాన్ బజార్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోలీసుల దర్యాప్తులో నిందితుడిని గుర్తించి బికి అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులపై దాడి చేసిన నిందితుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ గాయపడ్డారు.