శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (11:21 IST)

గృహ నిర్భంధంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేశారు. 
 
కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో టీపీసీసీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేష‌న్ల ముందు ధ‌ర్నాలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ‌ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
 
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇంటివద్ద పోలీసులు మోహరించారు. అలాగే, హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత‌లు మాధుయాష్కి, షబ్బీర్‌ అలీని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 
 
మ‌రోవైపు, నిజామాబాద్‌లో మధుయాష్కిని హౌస్ అరెస్టు చేశారు. అలాగే, ప‌లు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్న‌ప్ప‌టికీ తాము ధ‌ర్నాలు చేసి తీరుతామ‌ని కాంగ్రెస్ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరుతున్నారు.