ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (20:36 IST)

సుప్రీంలో 'ఆధార్' రికార్డు బ్రేక్ చేసిన 'అయోధ్య'

సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగిన కేసుల విషయంలో 'ఆధార్' రికార్డును 'అయోధ్య' బ్రేక్ చేసింది. ఆధార్ వ్యవహారంపై గతంలో 38రోజుల విచారణ సాగింది. అయోధ్య కేసు విచారణ 40 రోజులు సాగింది.

తొలి స్థానంలో ఉన్న 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసులో 68 రోజుల పాటు వాదనలు ఆలకించింది సర్వోన్నత న్యాయస్థానం. దశాబ్దాల నాటి అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. అభ్యంతరాల సమర్పించేందుకు గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

ఏళ్లనాటి భూవివాదంలో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ ఉండటం వల్ల ఆ లోపే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు నవంబర్ 4 నుంచి 17 మధ్య సుప్రీం తన నిర్ణయం ప్రకటిస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు.