శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (20:31 IST)

అయోధ్య కేసు తీర్పుపై ఉత్కంఠ

దశాబ్దాల నాటి అయోధ్య భూవివాదం కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. నవంబర్ 4-17 మధ్య ఏ రోజైనా తీర్పు వెలువడే అవకాశముంది. సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో విచారణ పూర్తయింది. 40 పనిదినాలు రోజువారీ వాదనలు విన్న సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అదనంగా ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పాలంటే.. 3 రోజుల్లో లిఖితపూర్వకంగా అందించాలని సూచించింది. ఈరోజు సాయంత్రం 5గంటలలోపు వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించగా... అందుకు గంట ముందే విచారణ పూర్తి చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయోధ్య కేసులో తీర్పు వెలువరించే తేదీపై సుప్రీంకోర్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యున్నత ధర్మాసనం నిర్ణయం ఎవరి పక్షాన ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆలోగా అయోధ్య కేసు తీర్పు వెలువడే అవకాశముంది.