శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:46 IST)

అయోధ్యపై 17న తేల్చేస్తాం.. సుప్రీం

అయోధ్య వివాదంపై 17న తేల్చేస్తామ ని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయోధ్యలో అధికారులు 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు.

ఈ ఉత్తర్వులు డిసెంబరు 10వ తేదీ వరకు అమలులో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్‌ అనూజ్‌ కుమార్‌ ఝా ప్రకటించారు. అయోధ్యలో డ్రోన్ల ఉపయోగం, వీడియో చిత్రీకరణపైనా నిషేధం విధించారు. తమ అనుమతి లేకుండా దీపావ ళి టపాసుల విక్రయం, కొనుగోళ్లు కుదరదన్నారు.

మరోవైపు యూపీ వక్ఫ్‌బోర్డు చైర్‌పర్సన్‌ జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీకి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణలో భాగంగా అయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసనం సోమవారం 38వ రోజు వాదనలు విన్నది. ముస్లింల తర ఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ ధర్మాసనాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘అన్ని ప్రశ్న లు మమ్మల్నే అడుగుతున్నారు. హిందూ పక్షాలను ఏమీ అడగడం లేదు’’ అన్నారు. వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని సున్నీ వక్ఫ్‌బోర్డు కోరింది.