మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

కడుపు నొప్పితో వస్తే మగవారికి ప్రెగ్నెన్సీ టెస్టులు

ఆసుపత్రికి వచ్చిన మగవారికి ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కడుపు నొప్పితో వచ్చిన ఇద్దరు మగవారికి జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురైన చేదు సంఘటన ఇది.

అనంతరం విషయం తెలుసుకున్న సదరు డాక్టరు ఇద్దరికీ క్షమాపణలు చెప్పారు. జార్ఖండ్‌లోని ఛాత్ర్ జిల్లాలో ఉన్న సిమేరియా ఆసుపత్రికి అక్టోబర్ 1న కడుపు నొప్పితో ఇద్దరు మగ పేషెంట్లు వచ్చారు. నేరుగా వెళ్లి డాక్టర్ ముఖేష్‌ను కలిశారు.

వెంటనే ఆయన హెచ్ఐవీ, హెచ్‌బీఏ, హెచ్‌సీబీ, సీబీసీ, హెచ్‌హెచ్-2తో పాటు ఏఎన్‌సీ పరీక్షలు చేసుకోవాలని రాశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ, చివరి ఏఎన్‌సీ పరీక్ష మహిళలకు చేయించాల్సింది. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ పరీక్ష. అది కూడా ఒక వేళ మహిళ అయితే అని దానిపై ఉంటుంది.
 
అది గమనించకుండా లిస్ట్‌లో ఉన్న టెస్ట్‌లన్నీ రాశారు డాక్టర్ ముఖేష్. గోపాల్ గంజు(22), కామేశ్వర్ గంజు (26) అనే ఇద్దరు.. పాథలాజికల్ ల్యాబ్‌కు వెళ్లినప్పుడు ఏఎన్‌సీ పరీక్ష రాసి ఉండడంపై అక్కడి వైద్యుడు చికాకు పడ్డాడు.

ఈ టెస్ట్ కన్సల్టింగ్ డాక్టర్ సూచించాడని తెలిసీ విస్తుపోయారు. ఏమైతేనేం, ఇద్దరికీ ఆ టెస్ట్ ఏంటో చెప్పారు. వెంటనే బాధితులిద్దరూ కన్సల్టింగ్ డాక్టరును కలిసి అడగడంతో.. పొరపాటును అంగీకరించి విచారం వ్యక్తం చేశారు.