ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (14:44 IST)

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు.

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు. ఆమె పేరు అశ్వనీ. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. అశ్వనీకి సంవత్సరం క్రితం డాక్టర్ రోహిత్‌తో పెళ్లయింది.
 
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చిన కారణంగా అశ్వని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భర్త ఆమెకు విడాకుల నోటిసును ఇంటికి పంపించాడు. ఈ ఆవేదనను తట్టుకోలేక అశ్వినీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో సారీ అని రాసిపెట్టింది. 
 
అశ్వనీ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.