గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (15:09 IST)

వంటింట్లో మహిళ... వెనుకనే వచ్చి కౌగిలించుకున్న డెలివరీ బాయ్

ఒంటరిగా ఉన్న ఓ మహిళ పట్ల మినరల్ వాటర్ డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. మేడం.. మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడటమేకాకుండా వంటింట్లోకి వెళుతున్న ఆ మహిళను వెనుకనే వచ్చి కౌగిలించుకున్నాడు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇందిరానగర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శివ అనే యువకుడు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి మినరల్ వాటర్ బాటిల్ తీసుకువచ్చాడు. నీళ్ల బాటిల్ తీసుకున్న గృహిణి వంటగదిలోకి వెళ్లింది. 
 
అంతలో డెలివరీ బాయ్ ఇంట్లోకి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళను పట్టుకొని లైంగికంగా వేధించాడు. మహిళ కేకలు వేయడంతో డెలివరీ బాయ్ పారిపోయాడు. దీంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర బెంగళూరు పోలీసులు నిందితుడైన శివను అరెస్టు చేశారు.