సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (13:26 IST)

నీలి చిత్రాలు చూపించి.. అందులో చేసినట్టుగా అసహజ శృంగారనికి భర్త ఒత్తిడి.. టెక్కీ భార్య ఫిర్యాదు

బెంగుళూరుకు చెందిన ఓ శాడిస్ట్ భర్త.. భార్యకు నీలి చిత్రాలు చూపించి.. అందులో చేసినట్టుగా అసహజ శృంగారం చేసేలా భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, అలాచేయడం ఏమాత్రం ఇష్టంలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగుళూరుకు చెందిన ఓ శాడిస్ట్ భర్త.. భార్యకు నీలి చిత్రాలు చూపించి.. అందులో చేసినట్టుగా అసహజ శృంగారం చేసేలా భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, అలాచేయడం ఏమాత్రం ఇష్టంలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శాడిస్ట్ భర్తను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఈమెకు అదేప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి అసహజ శృంగారం చేయాలని భార్యపై భర్త ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా పడకగదిలో తమ శృంగార కార్యక్రమాలను సెల్ ఫోన్‌లో రికార్డు చేస్తూ... ప్రతిరోజూ నీలిచిత్రాలు చూపిస్తూ అందులో ఉన్నట్టు సెక్స్ కావాలని భార్యను వేధిస్తూ వచ్చాడు. 
 
అయితే ప్రతిరోజూ భార్యపై పెట్టే వేధింపులను భరించలేక భార్య విసిగిపోయింది. అయితే తాను చెప్పినట్టు వినకపోతే పడకగదిలో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను పుట్టింటివారికి పంపుతామని బెదిరించాడు. ఈ వేధింపులు రోజురోజుకూ శృతిమించడంతో వీటిని తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.