సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (14:18 IST)

ఓరి దేవుడో... వాళ్లకు చిక్కామంటే ఇంకేమైనా వుందా.. జీలం నదిలోకి దూకి పారిపోతున్న ఉగ్రవాదులు...

యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే.

యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోవడాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. 
 
ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్‌లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి పారిపోయారు. వీటిని సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు.