గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (12:53 IST)

ఐదేళ్ల ప్రేమ.. వేరొక వ్యక్తితో ఎంగేజ్‌మెంట్.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు

knife
బెంగళూరులో ఘోరం జరిగింది. కాకినాడకు చెందిన యువతి హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియుడు ఆమెను 16 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన యువతి లీలా పవిత్ర (28) తనను దూరం పెట్టి వేరొక వ్యక్తితో పెళ్లికి రెడీ అయ్యిందనే కోపంతో ఆమె ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్లిన లీలా పవిత్ర ఓ ల్యాబ్‌లో పనిచేస్తుందని... అదే ల్యాబ్‌లో పనిచేసే దివాకర్ అనే వ్యక్తితో ప్రేమలో వుందని పోలీసులు తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రేమలో వున్న వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల పాటు లీలా దివాకర్‌కు దూరమైంది. 
 
ఇటీవల ఆమెకు వేరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న దివాకర్ ఆమెను కోపంతో హత్య చేశాడు. ఆఫీసు బయటే ఆమెను కత్తితో పొడిచి.. సహోద్యోగులు చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. దివాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లీలాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.