1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (12:36 IST)

అన్నదాతలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్... పీఎం కిసాన్ నిధుల బటన్ నొక్కుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి మంగళవారం జమ చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ మూడో విడత కింద ఈ నిధులను జమ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నాలుగో యేడాది మూడో విడత వైఎస్ఆర్, పీఎం కిసాన్ నిధులను రైతు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇటీవల పంటల్లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ కింద పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ధనిక అగ్రహార మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడతను సీఎం జగన్ రైతులకు పంపిణీ చేస్తారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సీడీ ఇచ్చే నిధులను ల్యాప్‌టాప్‌‍లో బటన్ నొక్కి ఆయన వారివారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు.