శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 జనవరి 2024 (22:33 IST)

ప్రెగ్నెన్సీ చేస్తే రూ. 13 లక్షల ప్యాకేజీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.799, ఎక్కడ?

pregnant
ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి ఏ స్థాయిలో వుంటుందో మోసాలు కూడా అలాగే పెరుగుతూ పోతున్నాయి. నెట్ ద్వారా కేటుగాళ్లు రకరకాల అడ్డదారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కేటుగాళ్లు నిరుద్యోగ యువకులపై వల వేసారు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు.
 
బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అనే ఫేక్ సంస్థ ద్వారా ఉద్యోగాలిస్తామంటూ ఇంటర్నెట్ ద్వారా యువకులకు వల వేసారు. ఈ ఉద్యోగం అర్హత ఏంటంటే.. తమ జాబితాలో వున్న అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ చేస్తే రూ. 13 లక్షలు ప్యాకేజీ ఇస్తారు. ఒకవేళ చేయలేకపోతే 5 లక్షలు చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం రూ. 799 క్యాష్ పేచేయాలి. ఆ తర్వాత తమ వద్ద వున్న జాబితాలోని అందమైన అమ్మాయిల ఫోటోలను చూపిస్తారు.
 
ఆ ఫోటోలను చూసి వారి వలలో పడ్డ యువకుల నుంచి స్థాయిని బట్టి రూ. 5000 నుంచి రూ. 20000 వరకూ గుంజేస్తారు. ఆ తర్వాత యువకుడు సెలక్ట్ చేసుకున్న అమ్మాయి ఫలానా చిరునామాలో వున్నదంటూ అడ్రెస్ ఇస్తారు. ఆ తర్వాత సదరు యువకుడు ఆ చిరునామాను పట్టుకుని వెళ్తే అక్కడ అమ్మాయి వుండదు, తిరిగి వీరికి కాల్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఇలా చాలామంది యువకులు మోసపోయారు. చివరికి కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది. ఈ యాప్ క్రియేట్ చేసిన నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటివరకూ 8 మంది నిందితులు పట్టుబడ్డారు. కనుక నెట్ ద్వారా విసరే ఆశల వలలో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.