మేనమామ కూతురిపై అత్యాచారం.. చిన్నారి మృతి ఎక్కడ?

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:47 IST)
కరోనా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా కామాంధుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో ఎనిమిదేళ్ల బాలికను బంధువే దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందా జిల్లాకు నోయిడా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జీతూ అనే యువకుడు నోయిడా పరిధిలోని సలార్‌పూర్‌లో తన మేనమామ ఇంటికి సమీపంలోనే కుటుంబంతో నివాసం ఉండేవాడు. తన మేనమామ కూతురైన ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడు. 
 
పొరుగునే ఉంటూ అదను కోసం ఎదురుచూశాడు. ఎవరూ లేని సమయం చూసి మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై హత్య, రేప్, చిన్న పిల్లలపై లైంగిక నేరాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం