మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (14:13 IST)

తల్లిపై అత్యాచారం.. అడ్డుకున్న మైనర్ బాలుడు.. కానీ కొట్టి చంపేశారు..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను అమలు పరచడంలో విఫలమైంది. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు చోటుచేసుకుంటున్న తరుణంలో, బీహార్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కామాంధులకు చుక్కలు చూపించాడు.. ఓ మైనర్ బాలుడు. తల్లిపై జరగాల్సిన అకృత్యాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ కామాంధుల కోపానికి బలైపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజఫర్ జిల్లా ధరంపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ, తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజేంద్ర షా అనే వ్యక్తికి చెందిన దుకాణంలో పనిచేస్తూ.. ఆమె కొడుకుని పోషించుకుంటోంది. ఆ షాపు యజమాని కొడుకు పప్పు.. దుకాణంలో పనిచేసే మహిళపై కన్నేశాడు. అతని స్నేహితులతో కలిసి దుకాణం వద్దకు వచ్చి... ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
 
అయితే ఆమె కుమారుడు అతనిని అడ్డుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. తన స్నేహితులతో కలిసి బాలుడిని చితకబాదాడు. తీవ్రగాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిందితులకు శిక్ష విధించాలని కోరుతూ.. గ్రామస్థులు బాలుడి శవంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.