మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (08:49 IST)

చోరీకి వచ్చిన మహిళ శీలాన్ని దోచుకున్న దొంగ

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అత్యాచారానికి గురైంది. ఆ మహిళ ఇంట్లో చోరీకి వచ్చిన ఓ దొంగ.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు, కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఇది రోజువారి వృత్తి. కానీ రాత్రివేళలో మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసే ఓ మహిళ (33) ఒంటరిగా ఇంట్లో ఉంది. దీన్ని గమనించిన దేవరాజ్... ఆ మహిళ ఇంట్లోకి చోరీకని వచ్చి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోవున్న విలువైన వస్తువులను కూడా దోచుకుని పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీఫుటేజీల ఆధారంగా నిందితుడని అరెస్టు చేశారు.