శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (12:53 IST)

దీపావళి.. బీజేపీ ఎంపీ రిటా బహుగుణ జోషీ మనువరాలు మృతి

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, ప్రయాగ్‌రాజ్‌ ఎంపీ రిటా బహుగుణ జోషీ ఇంట్లో దీపావళి పండగ విషాదం నింపింది. టపాసుల మంటలు అంటుకుని రిటా ఆరేళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఎంపీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లో దీపావళి రోజు రాత్రిపూట రిటా మనవరాలు కియా టపాసులు పేల్చేందుకు ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. టపాసులు అంటిస్తుండగా కియా దుస్తులకు నిప్పంటుకుంది.
 
 అయితే బాణాసంచా పేలుడు శబ్దాల వల్ల చిన్నారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత గాయాలతో పడి ఉన్న కియాను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి శరీరం 60శాతం కాలిపోయింది.
 
మెరుగైన చికిత్స కోసం మంగళవారం చిన్నారిని ఢిల్లీకి తరలించాల్సి ఉండగా.. పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున కియా కన్నుమూసింది. కాగా, ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఈ చిన్నారి.. దురదృష్టవశాత్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో రిటా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.