గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 జులై 2021 (07:44 IST)

ఆగస్టు 15 నాడు బిజెపి నేతలకు నల్ల జెండాలు

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా అధికార బిజెపికి మరో హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు బిజెపి నేతలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

హర్యానా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. జాతీయ జెండాలతో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహిస్తామని, బిజెపి నేతలకు నల్ల జెండాలు చూపుతామని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు గత కొన్ని రోజులుగా సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం ఆదివారం నాటికి 241వ రోజుకు చేరింది.